Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీరా? డ్రెస్సా?.. ఇవాంకా కట్టేదేమిటి?.. ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్!

  • ఇవాంకా కోసం రెడీ అవుతున్న పోచంపల్లి పట్టుచీర
  • ప్రధాని మోదీ ఇచ్చే విందులో చీరకట్టుతో హాజరయ్యే అవకాశం
  • గోల్కొండ సందర్శన మాత్రం మోడ్రన్ డ్రెస్ తోనే..
మరో వారం రోజుల్లో హైదరాబాద్‌లో అడుగుపెడుతున్న ఇవాంకా ట్రంప్ ఏం కట్టుకోబోతున్నారు? భారత సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుంటారా? మోడరన్ డ్రెస్‌ ధరిస్తారా? ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయింది. వృత్తి రీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇవాంకాకు స్టైల్ అనే బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్ నుంచి ఏటా ఓ కలెక్షన్ విడుదలవుతోంది.

దీనికితోడు ఇవాంకా ఎప్పుడూ అమెరికన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులనే ధరిస్తుంటారు. ఇటీవల జపాన్‌లో జరిగిన వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ విమెన్ (వావ్) సదస్సులో ఆమె జపాన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. విదేశీ పర్యటనల సమయంలో ఆమె అక్కడి సంప్రదాయ దుస్తులు ధరించడం అదే తొలిసారి.

తాజాగా ఇప్పుడు హైదరాబాద్‌లో కాలుమోపనున్న ఇవాంకా కోసం హైదరాబాద్ ప్రభుత్వం ప్రత్యేకంగా పోచంపల్లి పట్టుచీరను నేయిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చే విందులో ఇవాంకా ఈ చీరను ధరించి పాల్గొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే గోల్కొండ సందర్శన సమయంలో ఆమె చీర ధరించకపోవచ్చని అంటున్నారు. గతంలో భారత పర్యటనకు వచ్చినప్పుడు డయానా, హిల్లరీ క్లింటన్, చెర్రి బ్లెయిర్ వంటివారు కాళ్లు కనిపించకుండా హుందాగా ఉండే దుస్తులు ధరించారు కాబట్టి, ఇవాంకా కూడా సంప్రదాయ చీరకట్టులో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
Ivanka Trump
Donald Trump
America
Hyderabad

More Telugu News